Home తాజా వార్తలు దడ పుట్టిస్తున్న ‘ఆవిరి’ ట్రైలర్….

దడ పుట్టిస్తున్న ‘ఆవిరి’ ట్రైలర్….

'AVIRI' Movie

 

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రవిబాబు ప్రస్తుతం దెయ్యం కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్న మరో ఆసక్తికరమైన సినిమా ‘ఆవిరి’. ఈ చిత్రాన్ని స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు టేకప్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదల చేసిన మూవీ ఫస్ట్‌లుక్‌, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచేసింది.  ఇందులో ర‌విబాబుతో పాటు నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చత్రాన్ని నవంబర్ 1న విడుదల చేయనున్నారు.

గత కొంత కాలంగా రవిబాబు దెయ్యాలనే టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నాడు. ‘అవును’, ‘అవును2’ దెయ్యం సినిమాలు చేసిన రవిబాబు, ఆ తర్వాత తన రూటు మర్చుకొని ఓ పంది పిల్లతో ‘అదిగో’ అనే డిఫరెంట్ సినిమా చేశాడు. అయితే ఈ మూవీ అంతగా అలరించకపోవడంతో మళ్లీ దెయ్యం మూవీనే నమ్ముకున్నాడు. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.

Aaviri Trailer Released