- Advertisement -
జనగామ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరిస్ స్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన బైక్ స్టంట్‌లో ప్రపంచ వండర్ రికార్డును ఎండి.అబ్బాస్ దక్కించుకున్నాడు. ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కో ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణశ్రీ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన బైక్ స్టంట్‌కు ముఖ్య అతిధిగా స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్ఏ తాటికొండ రాజయ్య హాజ రయ్యారు.30 నిమిషాల్లో 1016 బైక్‌లు అబ్బాస్ పొట్ట మీద నుండి వెళ్ళాల్సి ఉండగా నిర్ణీత సమయం కంటే ముందే ప్రదర్శన పూర్తి చేశారు.
- Advertisement -