Saturday, April 20, 2024

ఎన్నికల కమిషన్‌ను రద్దు చేయండి: ఉద్ధవ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

ముంబై: ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని వర్గమే నిజమైన శివసేన అంటూ ప్రకటించిన భారత ఎన్నికల సంఘాన్ని(ఇసి) రద్దు చేయాలని శివసేన(యుబిటి) వర్గం నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు. తమ పార్టీ పేరును, చిహ్నాన్ని (విల్లు, బాణం) దొంగిలించారని, థాక్రే అన్న పేరును దొంగలించలేరని సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ఇసి నిర్ణయాన్ని సవాలు చేస్తూ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఇసి ఉత్తర్వులు తప్పని, తమకు ఉన్న ఏకైక ఆశ సుప్రీంకోర్టు ఒక్కటేనని ఆయన అన్నారు. పార్టీ పేరును, చిహ్నాన్ని ఒక వర్గానికి నేరుగా ఇచ్చిన ఉదంతాలు ఒక్కటి కూడా లేవని ఆయన అన్నారు. ఇంత హడావుడిగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఇసి ఎందుకని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ పేరును, చిహ్నాన్ని మరో వర్గం దొంగలించకలదేమో కాని థాక్రే పేరును దొంగలించలేదని, తాను బాలాసాహెబ్ థాక్రే కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News