Wednesday, April 24, 2024

గృహనిర్మాణ శాఖ రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం రహదార్లు, భవనాల శాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించి జిఓ3ను రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జారీ చేశారు. గృహనిర్మాణ శాఖలో ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో పాటు బలహీనవర్గాల గృహనిర్మాణాన్ని ఇతర శాఖలు చేపడుతుండడంతో గృహనిర్మాణ శాఖను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ శాఖ కింద గృహనిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గృహనిర్మాణ శాఖను రోడ్లు, భవనాల శాఖలో విలీనం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ శాఖలో మిగిలిన అంశాలు, ఉద్యోగులు, సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఆర్ అండ్ బి శాఖకు బదిలీ చేస్తున్నట్టు సిఎస్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ, ఆర్ అండ్ బి, సాధారణ పరిపాలనా శాఖలను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News