Home దునియా ఎలుక

ఎలుక

 Rat Story

 

వేటగాడు వేసిన వలలో చిన్న సింహం పిల్ల చిక్కుకుంది.స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తున్న ఒక ఎలుకల రాజు వలలో చిక్కు కున్న సింహం పిల్లను చూశాడు. వేటగాడు వస్తే ప్రమాదమని గబ గబా వెళ్ళి తన వాళ్లందరినీ పిలుచుకొని వచ్చి ముందుగా ముందు రెండు వైపుల కొన్ని ఎలుకలు చేరి వలను కొరకడం మొదలు పెట్టాయి.
కాసేపటికి సింహం పిల్ల తల్లి అటుగా వచ్చింది. విషయం తెలుసుకొని ఎలుకలు కొరికిన వలను రెండు వైపులా కాలితో బలంగా లాగింది. తల్లిని చూడగానే సింహం పిల్ల ఏడుస్తూ వల నుండి బయట పడింది.

“నా బిడ్డను కాపాడారు మీ మేలు ఎప్పటికీ మరచిపోలేను… మీకెలాంటి సహాయం కావాలన్నా చేస్తాను” అని ఎలుకలతో అంది సింహం.
అప్పుడు ఎలుకల రాజు “ఎక్కడి నుండో ఒక పులి వచ్చి సాధు జంతువులు వున్న మా అడవిని ఆక్రమించుకుని పెత్తనం చెలాయిస్తు జంతు హింసకు పాల్పడుతోంది. మీరే ఆ పులికి బుద్ది చెప్పాలి” అని అంది.
“సరే! ఇప్పుడే మీ అడవికి వెళదాము పదండి” అని ఎలుకలతో పాటు తన బిడ్డను తీసుకొని బయలుదేరింది సింహం.
స్థావరాన్ని చేరుకున్న సింహాన్ని చూసిన పులి కాస్త బెదిరినా ధైర్యం తెచ్చుకొని “ఇది నా స్థావరం. ఇక్కడ నీకేం పని?” అని అంది.

“ఇన్నాళ్ళు నీ రాజరికం చెల్లింది. ఇక మీదట అలా జరగదు. నాతో పోరాడ తావా… లేక తోక ముడుచుకుని ఈ అడవిని దాటి వెళ్లిపోతావా!” అని జూలు విదిలిస్తూ గర్జించింది.
సింహంతో పోరాడే శక్తి లేక పులి నిజంగానే తోక ముడిచి ఆ అడవి నుండి వెళ్లిపోయింది.
“ఇక మీకు ఎలాంటి భయం లేదు.. ఇదే చెబుతున్నాను పిల్లులు కానీ ఇతర పక్షులు కానీ ఎలుకలను చంపడానికి వీలు లేదు. మీరంతా స్వేచ్ఛగా ఐకమత్యంతో కలసి మెలసి ఉండండి. మా వల్ల కూడా మీకు ఎలాంటి భయం లేదు. మేము కూడా చాలా ఏళ్ల నుండి శాకాహారమే తింటున్నాము.. మీకు అండగా నేను ఉంటాను” అని ధైర్యం చెప్పింది.

“ మీకు కృతజ్ఞతలు మహారాజా!” అంది ఎలుకల రాజు. అవును మీ మేలు మరచి పోలేము అన్నాయి మిగతా ఎలుకలు.
ఎలుకలు చేసిన సహాయానికి సింహం పులిని తరిమి మనలను కాపాడడం బాగుందని సాధు జంతువులన్నీ ఎంతో సంతోషించాయి.

About Lion and Rat Story in Telugu