Home తాజా వార్తలు ముగిసిన అబ్రాడ్ ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్

ముగిసిన అబ్రాడ్ ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్

MBBS

మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాలలో ఎంబిబిఎస్ చేయాలనుకునే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు టి న్యూస్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో నిర్వహించిన అబ్రాడ్ ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్2019 ఆదివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన ఈ ఫెయిర్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. విదేశాలలలో మెడిసిన్ చేయాలని భావిస్తున్న విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు బారులు తీరడంతో ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కిక్కిరిపోయింది. చివరి రోజు తాకిడి మరింత పెరిగింది. ఏఏ దేశాల్లో ఎంబిబిఎస్ చేయవ చ్చు? ఆ దేశాల యూనివర్సిటీలో ఫీజు ఎంత..? ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఏ దేశాల్లో ఎంబిబిఎస్ చదవడానికి ఆసక్తి చూపించారు..? ఆయా యూనివర్సిటీల్లో మౌలికసదుపాయాలు, బోధనా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయా? లేదా? ఇలా ఎన్నో అనుమానాలు, అపోహలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నివృత్తి చేసుకున్నారు. అన్ని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలను తిరిగి విదేశీ ఎంబిబిఎస్ గురించి సమాచారం సేకరించాల్సిన అవసరం లేకుండా ఒకే దగ్గ ర సుమారు 30 కన్సల్టెన్సీలకు సంబంధించిన సమాచారం లభించడంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ ఫెయిర్‌లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సౌత్ వెస్ట్రన్ వర్సిటీ, దావావో మెడికల్ వర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ, కొలంబస్ సెంట్రల్ వర్సిటీ, కిర్గిస్టేట్ మెడికల్ అకాడమీ, ఆస్తాన మెడికల్ వర్సిటీ, సెమీస్టేట్ మెడికల్ వర్సిటీ, అకాకి మెడికల్ వర్సిటీ, జార్జి యా నేషనల్ వర్సిటీ, సెయింట్ పాల్ వర్సిటీలతోపాటు గుర్తింపు పొందిన అనేక యూనివర్సిటీలు పాల్గొన్నాయి.
లక్కీ డ్రా విజేతకు ల్యాప్‌టాప్
టి న్యూస్ అబ్రాడ్ ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ముగింపు రోజు టి న్యూస్ ఛీఫ్ జనరల్ మేనేజర్ ఉపేందర్ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. లక్కీ డ్రాలో మియాపూర్‌కు చెందిన షేక్ రుకియా విజేతగా నిలిచా రు. విజేతకు టి న్యూస్ సిజిఎం ఉపేందర్ ఫోన్ చేసి లక్కీ డ్రాలో ల్యాప్‌టాప్ గెలుచుకున్నట్లు సమాచారం అందించారు. లక్కీ డ్రా విజేత షేక్ రుకియా అందుబాటులో లేకపోవడంతో తర్వాత వారికి ల్యాప్‌టాప్ అందజేయనున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొన్న కన్సల్టెన్సీలకు టి న్యూస్ సిజిఎం ఉపేందర్ మెమెంటోలు ప్రదానం చేశారు. అబ్రాడ్ ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ‘మన తెలంగాణ’, ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలు ప్రచార భాగస్వాములుగా వ్యవహరిస్తుండగా, గ్రేట్ తెలంగాణ డాట్ కామ్, జిటి టివి వెబ్ మీడియా ప్రచార భాగస్వామిగా వ్యవహరించాయి. టిన్యూస్ సిజిఎం ఉపేందర్ తన బృందం సభ్యులు డిజి ఎం కిరణ్‌కుమార్, రాజశేఖర్ జక్కుల, ఉదయ్ భాస్కర్, వెంకట్, శ్రీనివాస రావు, దినేష్, సునిత తదితరులతో కలిసి రెండు రోజులపాటు నిర్వహించిన ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షించి విజయవంతం చేశారు.

 Abroad MBBS Education Fair 2019