Home తాజా వార్తలు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత…

ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత…

Inter-students

హైదరాబాద్‌: నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు ఆఫీసు దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు.ఇంటర్‌ బోర్డు కార్యదర్శిని కలిసేందుకు వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారికి కార్యదర్శి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. ఇంటర్‌ బోర్డు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.దీంతో ఆందోళన దిగిన ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలపై తక్షణమే సిఎం కెసిఆర్‌, కెటిఆర్‌ స్పందించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.కాలేజీ గేటు ఎదుట విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ABVP leaders and Students protests at inter board office