Home తాజా వార్తలు ఎసిబికి చిక్కిన సర్వేయర్

ఎసిబికి చిక్కిన సర్వేయర్

 

మన తెలంగాణ/వేములవాడ : ఎసిబి వలలో మరో అవినీతి చేప చిక్కింది. నాలా కన్వర్షన్ కోసం రూ.20వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తె రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి  చెందిన తూరుపాట శంకర్, చర్ల బాలరాజుకు సంబంధించిన 10గుంటల భూమి సర్వే నెంబర్ 90,91,92 చంద్రగిరి శివారుకు చెందినది. ఈ భూమిని ఐదు ప్లాట్లుగా వెంచర్ వేయడం జరిగింది. నాలా కన్వర్షన్ కొరకు సంబంధిత వేములవాడ ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మార్వో నక్క శ్రీనివాస్ దరఖాస్తును పరిశీలించి సంబంధిత మండల సర్వేయర్ సత్యనారాయణకు అప్పగించారు.

ఈ విషయం పై గత కొన్ని రోజుల నుండి బాధితులు ఆఫీస్ చుట్టు తిరగగా సత్యనారాయణ 25వేలు లంచం అడిగాడు. బాధితులు అంత డబ్బు ఇవ్వలేమని తెలుపగా, సర్వేయర్ ఖచ్చితంగా 20వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎసిబి డిఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 20వేల లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ శ్రీనివాస్, సర్వేయర్ సత్యనారాయణ పట్టుబడ్డారు. వీరి దగ్గర ఉన్న 20వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి అధికారులు పరిక్షించగా లం చం తీసుకున్నట్లు రుజువు కావడంతో వీరిని కస్టడిలోకి తీసుకుని సెక్షన్ 7,11 కింద బుధవారం కరీంనగర్ ఎసిబి కోర్టులో హజరు పరుచనున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.

 

ACB aptured Surveyor with Bribe in Rajanna Sircilla