Home తాజా వార్తలు ఈఎస్‌ఐ స్కాంలో మరో ముగ్గురు అరెస్ట్

ఈఎస్‌ఐ స్కాంలో మరో ముగ్గురు అరెస్ట్

ESI Scam

 

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురిని అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్టు చేశారు. తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్ లావణ్య, వీరితోపాటు వరంగల్ జెడి కార్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగి పాషాను ఎసిబి అధికారులు  అరెస్ట్ చేశారు. రాజేశ్వర్‌రెడ్డి రూ. 28 కోట్ల మందుల కొనుగోళ్లు, పంపిణీలో అవకతవకలకు పాల్పడినట్టు  ఎసిబి అధికారులు గుర్తించారు.

ప్రైవేటు ఆస్పత్రులకు ఈఎస్ఐ మందులను తరలించారన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురు పెద్దమొత్తంలో ఈఎస్‌ఐ మందులను ప్రయివేటు ఆస్పత్రులకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఈఎస్‌ఐ ఉన్నతాధికారి దేవికారాణి సహా మరికొందరు అధికారులు, సిబ్బంది ఇప్పటికే అరెస్ అయిన సంగతి తెలిసిందే. రూ. 100 కోట్ల మేరకు ఈ స్కాం జరిగినట్లు ఎసిబి అధికారులు భావిస్తున్నారు.  ఇప్పటికే ఈ కేసులో మొత్తం 16 మంది అరెస్టు అయిన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ACB arrested by 3 persons in ESI Scam