Friday, March 29, 2024

ఎసిబి కోర్టులో ఎంఎల్‌ఎ సండ్రకు చుక్కెదురు..

- Advertisement -
- Advertisement -

ACB Court opposes MLA Sandra Venkata Veeraiah Petition

మనతెలంగాణ/హైదరాబాద్: ఓటుకు నోటు కేసు నుంచి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు ఎసిబి న్యాయస్థానం నిరాకరించడంతో పాటు సండ్ర వెంకట వీరయ్య, మరో నిందితుడు ఉదయ్ సింహా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తనను అనవసరంగా ఇరికించారని సండ్ర వాదించగా ఆయన పాత్ర, ప్రమేయంపై ఆధారాలున్నాయని ఎసిబి తెలిపింది. ఉదయ్‌సింహాకు సంబంధం ఉన్నట్లు కూడా తగిన సాక్ష్యాలున్నాయని పేర్కొంది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహా డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేసింది. అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు ఓటుకు నోటు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కోర్టు ముందు హాజరయ్యారు.

ACB Court opposes MLA Sandra Venkata Veeraiah Petition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News