Tuesday, March 19, 2024

ఎసిబి వలలో మేడిపల్లి ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

ACB officials caught Medipally SI

హైదరాబాద్:  రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి రాజు మంగళవారం నాడు రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. ఓ రోడ్డు ప్రమాదంలో కేసులో బాధితుడు ప్రశాంత్‌ను మేడిపల్లి ఎస్‌ఐ యాదగిరిని ఎస్‌ఐ లంచం డిమాండ్ చేయడంతో ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ట్రాప్ చేసిన ఎసిబి అధికారులు ఎస్‌ఐ యాదగిరి పోలీస్ స్టేషన్‌లోనే రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద నవంబర్ 28న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కాలుకి ఫ్యాక్చర్ కావడంతో అతని కుమారుడు ప్రశాంత్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ యాదగిరి రాజు పిర్యాదు దారుడు ప్రశాంత్‌కు సర్టిఫికెట్స్ కోసం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరగా పదివేల రూపాయలు ఇవ్వాలని ఎస్‌ఐ యాదగిరి రాజు కోరగా, ప్రశాంత్ పది వేల రూపాయల నగదు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఎస్‌ఐ యాదగిరి తనను లంచం అడిగిన విషయాన్ని ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈక్రమంలో ఎసిబి అధికారుల సూచనల మేరకు ఎస్‌ఐ యాదగిరి రాజుకు ప్రశాంత్ నగదు ఇస్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎసిబి అధికారులు ఎస్‌ఐ యాదగిరి చేతివేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అవినీతికి పాల్పడి పట్టుబడిన ఎస్‌ఐ యాదగిరికి 14 రోజుల రిమాండ్ విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News