Home తాజా వార్తలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆస్తులపై ఎసిబి సోదాలు

ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆస్తులపై ఎసిబి సోదాలు

Jyothi-Kiran

నిజామాబాద్: జిల్లాకు చెందిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ ఆస్తులపై మంగళవారం ఉదయం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో అధికారులు సోదాలు చేపట్టారు. నిజామాబాద్, హైదరాబాద్ సహా ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో కిరణ్ వద్ద కిలో బంగారం, రంగారెడ్డిలో ప్లాట్లు, జహీరాబాద్‌లో 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ACB Officials searches on Assets of Excise Superintendent of Nizamabad.