Thursday, April 18, 2024

ముంబై ఉగ్ర దాడి కేసు విచారణ వేగవంతం చేయండి

- Advertisement -
- Advertisement -
Accelerate Mumbai terror attack case trial
పాక్ దౌత్యాధికారికి భారత్ ఆదేశం

న్యూఢిల్లీ: ముంబైలో 2008 సెప్టెంబర్ 26న దాడులు జరిగి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడి పాకిస్తానీ హైకమిషన్‌కు చెందిన ఒక సీనియర్ దౌత్యాధికారిని భారత ప్రభుత్వం శుక్రవారం పిలిపించుకుని ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఒత్తిడి చేసింది. ఈ కేసులో బాధితులైన 15 దేశాలకు చెందిన 166 కుటుంబాలు విచారణ ముగింపు కోసం ఎదురుచేస్తున్నాయని భారత ప్రభుత్వం తెలిపింది. తన అధీనంలో ఉన్న భూభాగాన్ని భారత్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమన్న తన వాగ్దానాన్ని పాకిస్తాన్ నిలబెట్టుకోవాలంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నోట్‌ను పాక్ సీనియర్ దౌత్యాధికారికి అందచేసింది. అత్యంత హేయమైన దాడులు జరిగి 13 సంవత్సరాలైనా పాకిస్తాన్ నేరస్తులకు శిక్ష విధించడంలో పాకిస్తాన్ ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ ఆ నోట్‌లో పేర్కొంది. పాకిస్తాన్ భూభాగం నుంచే ముంబై ఉగ్రదాడికి పథక రచన, అమలు జరిగాయని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం తన ద్వంద్వ ప్రమాణాలను విడనాడి ఆ భయానక దాడికి సంబంధించిన విచారణను వేగవంతం చేసి నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని కేంద్రం కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News