Home రాష్ట్ర వార్తలు మాజీ ఎంపి రాజయ్య ఇంట్లో దారుణ ఘటన

మాజీ ఎంపి రాజయ్య ఇంట్లో దారుణ ఘటన

హత్యలా, ఆత్మహత్యలా?

mmmm

తెల్లవారి లేస్తే వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో చివరి నామినేషన్ పత్రాలు దాఖలు చేయవలసి ఉండిన కాంగ్రెస్ అభ్యర్థి మాజీ, ఎంపి సిరిసిల్ల రాజయ్య ఇంటిలో హృదయాలను కలచివేసే మహా ఘోరం బుధవారం వేకువజామున జరిగిపోయింది. ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమలు వారి పడక గదిలో కాలి మసిబొగ్గులై కనిపించడం సంచలనం రేపింది. తెల్లవారు జామున 4 గంటలకు వారు సజీవ దహనమైనట్టు సమాచారం. చాలా కాలం నుంచి జరుగుతున్న కుటుంబ కలహాలు రాజయ్య కొడుకు అనిల్ మరో మహిళను వివాహమాడిన పరిణామం ఆయనకు, సారికకు మధ్య తీవ్ర విభేదాలు తలఎత్తిన నేపథ్యం, గతంలో రెండు సార్లు ఆమె పోలీసులను ఆశ్రయించి అత్తవారిపై కేసు కూడా పెట్టిందన్న సమచారం పలు ప్రశ్నలకు, అనుమానాలకు తావు కలిగిస్తున్నాయి.

స్థానికులు, సమీప బంధవులు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం గురించి, బుధవారం వేయాల్సిన చివరి నామినేషన్ గురించి మాట్లాడుకొని రాజయ్య ఇంటికి చేరుకు న్నారు. రెండవ ఫ్లోర్‌లోకి వెళ్ళి నిద్రించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కుమారుడు అనిల్ పడుకున్నారు. రెండవ ఫ్లోర్‌లో సారిక, తన ముగ్గురు కుమారులతో నిద్రించింది. బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో సారిక నిద్రిస్తున్న ఫ్లోర్ నుంచి పొగలు రావడంతో పరిసరవాసులు, రాజయ్య కుటుంబ సభ్యులు ఆ ఫ్లోర్‌కు చేరుకొని గదిలో అలుముకున్న మంటలను నీళ్ళు పోసి ఆర్పే యత్నించారు. మంటలు ఆరకపోవడంతో ఫైర్ ఇంజన్ కోసం ఫోన్‌చేశారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నట్లు చెబుతున్నారు. నలుగురు సజీవదహనమవుతూ కేకలు పెడుతున్నా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న భర్త అనిల్‌గానీ, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న రాజయ్య కుటుంబ సభ్యులుగానీ గుర్తించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. పరిసరవాసులు గుర్తించే వరకు కుటుంబ సభ్యులు పెద్దగా స్పందించలేదని అంటున్నారు.

వరంగల్: వరంగల్ మాజీ ఎంపి, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికైన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య నివాసంలో బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో కోడలు సారిక (35), ముగ్గురు మనుమలు అభినవ్ (5), అయోన్ (2), శ్రేయోన్ (2) (ఈ ఇద్దరు కవల పిల్లలు)లు అగ్నికి ఆహు తైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదే హాలను సైతం చూసేందుకు వీలులేని విధంగా నలుగురు మాంసం ముద్దలుగా మారిన హృదయవిదారక సంఘ టన అందరినీ కలచివేసింది. సారిక, తన ముగ్గురు చిన్నారులతో ఆత్మహత్యకు పాల్పడిందా? ఆమెను అత్తింటివారు పథకం ప్రకారం హత్యచేశారా? ఆనే అను మానాలు వేధిస్తున్నాయి.
రాత్రి ఏం జరిగింది?
స్థానికులు, సమీప బంధవులు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం గురించి, బుధవారం వేయాల్సిన చివరి నామినేషన్ గురించి మాట్లాడుకొని రాజయ్య ఇంటికి చేరుకున్నారు. తాను ఉంటున్న రెండవ ఫ్లోర్‌లోకి వెళ్ళి నిద్రించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కుమారుడు అనిల్ పడుకున్నారు. రెండవ ఫ్లోర్‌లో సారిక, తన ముగ్గురు కుమారులతో నిద్రించింది. బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో సారిక నిద్రిస్తున్న ఫ్లోర్ నుంచి పొగలు రావడంతో పరిస రవాసులు, రాజయ్య కుటుంబ సభ్యులు ఆ ఫ్లోర్‌కు చేరు కొని గదిలో అలుముకున్న మంటలను నీళ్ళుపోసి ఆర్పే యత్నించారు. మంటలు ఆరకపోవడంతో ఫైర్‌ఇంజన్ కోసం ఫోన్‌చేశారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, నలుగురు సజీవదహనమవుతూ కేకలు పెడుతున్నా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న భర్త అనిల్‌గానీ, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న రాజయ్య కుటుంబ సభ్యులుగానీ గుర్తించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. పరిసరవాసులు గుర్తించే వరకు కుటుంబ సభ్యులు పెద్దగా స్పందించలేదని అంటున్నారు. కాగా, సంఘటన సమాచారాన్ని రాజయ్య స్వయంగా సుబేదారి పోలీ సులకు ఫోన్‌చేసి చెప్పారు. సిఐ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సిపి సుధీర్‌కుమార్ ఇతర పోలీసు అధికారులు అక్కడి చేరు కున్నారు. పోలీసులు, క్లూస్‌టీమ్, ఫొరెన్సిక్ బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. గదిలో నలుగురు సజీవ దహ నమయ్యారు. గది డోర్‌వద్ద చిన్నారులు పడి ఉన్నారు. బయటికి వచ్చేందుకు ప్రయత్నించి ప్రాణాలు విడిచి నట్లు భావిస్తున్నారు. కాగా, వంటగదిలో ఉండాల్సిన గ్యాస్‌సిలిండర్ బెడ్‌రూమ్‌లో ఉండడం పలు అను మానాలకు తావిస్తోంది. మంగళవారం రాత్రి గొడవ జరి గినట్లు చెబుతున్నారు. ఇది హత్యా, ఆత్మహత్యా, కుట్రా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పోటీ నుంచి తప్పుకుంటున్నా
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికైన రాజయ్య తెల్లవారితే (బుధవారం) మరో నామినేషన్ సెట్ వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన ఇంట జరిగిన సంఘటనతో ఆయన తీవ్ర దిగ్బ్రాంతికి గుర య్యారు. ఇంటి ముందు కంటనీరుపెడుతూ వచ్చిన వారికి ఆయన చేతులెత్తిమొక్కుతూ కనిపించారు. అక్కడికి వచ్చిన నాయకులు రాజయ్యను పరామర్శించి ఓదార్చారు. ఈ సంఘటనతో ఉప ఎన్నిక పోటీనుంచి తప్పించాలని రాజయ్య కోరారు. సోనియమ్మా..నన్ను క్షమించు..ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి తప్పు కుంటున్నానని రాజయ్య దీనంగా చెప్పారు.
టెన్షన్..టెన్షన్
బుధవారం ఉదయం 4గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాజయ్య నివాసం వద్ద టెన్షన్ నెలకొంది. పెద్ద సంఖ్యలో అక్కడికి జనం తరలివచ్చారు. ఐద్వా, చైతన్య మహిళా సంఘాల సభ్యులు ధర్నా చేశారు. సారికకు న్యాయం చేయాలంటూ రాజయ్య ఇంటి ముందు బైఠాయించారు. సంఘటన సమాచారం తెలిసిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని, మాజీ మంత్రి సారయ్య, గండ్ర, పొన్నం, వివేక్, వినోద్, కొం డేటి, అంజనీకుమార్, టిఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి, శంకర్‌నాయక్, వినయ్, టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, సీతక్క, వామపక్ష అభ్యర్థి గాలి వినోద్, బిజెపి నాయకులు ధర్మారావు, రాజే శ్వర్‌రావు, ఎర్రబెల్లి ప్రదీప్‌తోపాటు పలువురు జిల్లా ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీగా పోలీసుల మోహరింపుతో రాజయ్య ఇంటి పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన సమాచారం తెలి యగానే ఉదయం 5గంటల నుంచి రాజయ్య కుటుంబ సభ్యులను అరెస్టు చేసే వరకు స్థానిక పోలీసులతో పాటు సిపి సుధీర్‌బాబు ఇతర పోలీసు అధికారులు అక్కడే ఉన్నారు.
సారిక తల్లి ఫిర్యాదు
సారిక మృతి సంఘటన సమాచారం తెలియగానే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం వద్దూరు ఎల్లారెడ్డి నుంచి ఆమె బంధువులు తల్లి వంగాల లలిత,చెల్లి ఇతర బంధువులు సాయంత్రం 3గంటల సమయంలో ఇక్కడికి చేరుకున్నారు. తల్లి వంగాల లతిత ఫిర్యాదు చేశారు. తన బిడ్డ, మనుమలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా తమ బిడ్డను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బిడ్డ హత్యకు కారణమైన రాజయ్య, భార్య మాధవి, అల్లుడు అనిల్‌లను శిక్షించాలని కోరారు. అనంతరం శవపంచనామా పూర్తి చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఎంజిఎం మార్చూరీకి తరలించారు.
రాజయ్య, భార్య, కుమారుడి అరెస్టు
సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎంపి రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌ను సాయంత్రం 4గం టల సమయంలో పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో 498(ఎ) కింద కేసు నమోదై ఉన్నందున తాజాగా అనుమానస్పద కేసుగా నమోదు దర్యాప్తు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
అన్ని కోణాల్లో విచారణ: ఐజి, సిపి
నలుగురి మృతి సంఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఐజి నవీన్‌చంద్, సిపి సుధీర్‌బాబులు తెలిపారు. సంఘటనపై ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఫోరెన్సిక్ నిపుణులు,క్లూస్‌టీముల బృందాలను రంగంలోకి దింపామన్నారు. నిపుణుల శాస్త్రీయ నివేదిక అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఐజి నవీన్‌చంద్, సిపి సుధీర్‌బాబులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించామన్నారు.
అనిల్‌తో చాలా కాలంగా విభేదాలు
హుజురాబాద్‌లో చదువుకునే సమయంలో సారిక, అనిల్‌లు 2002లో ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. కొంత కాలం సజావుగానే కాపురం సాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. అనిల్ మరో మహిళను రెండవ వివాహం చేసుకోవడం వీరిద్దరి వైషమ్యాలకు దారితీసింది. ఈ విషయంలో గతంలో సారిక రెండు పర్యాయాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని బేగంపేటలో 2013 మార్చి 20న కేసు నమోదైంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో హన్మకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో సారిక ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సారిక అత్తింటివారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా రెండు పర్యాయాలు సారిక ఆత్మహత్యయత్నం చేయడం గమనార్హం. ఒకసారి చేయి కోసుకున్నది. తాజాగా కన్న బిడ్డలు ముగ్గురితో సజీవదహనం కావడం అందరినీ కంటతడిపెట్టించింది.