Home సిద్దిపేట మిషన్ భగీరథ పనులలో అపశృతి…

మిషన్ భగీరథ పనులలో అపశృతి…

Accidental Dead Mission bhagiratha Worker

దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పెద్ద మల్కేసాహెబ్‌దర్గా సమీపంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులలో అపశృతి… చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ట్యాంకు పై నుండి పడి మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలోని మల్కేసాహెబ్ దర్గా సమీపంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులలో మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు పనిచేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఆదివారం ఉదయం యధావిదిగా యువకులు పనులలో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు ముఖేశ్(25) అనే యువకుడు ప్రమాదవశాత్తు ట్యాంకు పైనుండి పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామాను నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కోడంగల్ అసుపత్రికి తరలించినట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.