Home జిల్లాలు సబ్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు

సబ్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు

Accidental fire fires in the substation
Accidental fire fires in the substation

మన తెలంగాణ/పరిగి : పరిగి పట్టణంలోని 220/133 కేవీ సబ్ స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పక్కన నిప్పు పెట్టడం వల్ల నిప్పు రవ్వలు వచ్చి ఆయిల్ పడటం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సబ్‌స్టేషన్ ఆవరణలో ఉన్న సీటీలు, పీటీసీ, లైటింగ్ అరెస్టెట్‌లు తగలబడిపోయా యి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగి పొగులు కమ్ముకున్నాయి. వెం టనే ఫైర్‌సిబ్బందికి సమాచారం ఇవ్వగా అరగంటపాటు శ్ర మించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.