Home భద్రాద్రి కొత్తగూడెం మన్యంలో చదువులకు మంగళం

మన్యంలో చదువులకు మంగళం

  • హేతుబద్దీకరణకు బలవనున్న 98 బడులు
  • ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న విద్యకు భంగం
  •  సుమారు 200 మంది ఉపాధ్యాయులకు తప్పని తప్పలు
  • గిరిజన ప్రాంతాలకు మినహాయింపు ఉంటే బాగూ….

School-Student

భద్రాచలం : ప్రభుత్వం విద్యావ్యస్థలో అనుసరించబోతున్న హేతుబద్దీకరణ విధానం గిరిపుత్రులకు శాపంగా మారనుంది….ఎంతో కాలంగా ఐటిడిఎ ఉన్నప్పటికీ విద్యాపరమైన ప్రయోజనం ఇప్పుడిప్పుడే చేకూరుతోంది. చెట్టుపుట్టలతో మమేకమై జీవనం సాగిదీసే గిరిజనుల కుటుంబాల్లో కాంతిరేఖలు నింపేందుకు మూరుమూల గ్రామాల్లో సైతం బడులను నెలకొల్పి గిరిపుత్రుల బ్రతుకలకు బాటలు వేస్తోంది. ఇప్పుడు తెలంగాణ సర్కారు అనుసరించబోతున్న నూతన విద్యా విధానం మన్యంలో 98 బడులకు మంగళం పాడనుంది.

ఉమ్మడి రాష్ట్రంలో దగాకు గురైన తెలంగాణ ప్రాంతానికి ఎట్టకేలకు విముక్తి లభించి స్వరాష్ట్రం ఏర్పాటైంది. అయితే సొంతగడ్డపైన అయినా ఉత్తమ చదువులు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విద్యావ్వస్థ బలోపేతానికి కంకణం కట్టుకుంది. ఇందుకు హేతుబద్దీకరణ పేరుతో సర్కారు బడులను ఓ తాటిపైకి తెచ్చి ఉత్తమ విద్యావంతులను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టనుంది. ఈ వ్యవహారం రాష్ట్రం అంతా ఓ ఎత్తు అయితే… భద్రాచలం మన్యంలో మాత్రం మరో ఎత్తుగా ఉంది. ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంతో భద్రాచలం మన్యంలో ఇప్పుడుడిప్పుడే చదువులవైపు ప్రయాణిస్తున్న గిరిపుత్రులు మళ్లీ అటవీ గ్రామాలకే పరమితం అవడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. మరో నెలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మన్యంలో వెసులు బాటు కల్పించాలని ఆయా గిరిజన గ్రామాల ప్రజలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.