Thursday, April 18, 2024

లైంగికదాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

Accused sentenced to life imprisonment in Sexual assault case

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడికి పొక్సో చట్టం కింద జీవితఖైదుతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సురేశ్ మంగళవారం నాడు తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న వంగూరి ప్రవీణ్‌కుమార్ ఆలియాస్ కుమార్(32) ఇంటి పక్కన ఉంటున్న ఇంటర్ విద్యార్థినికి(17) మాయమాలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. బాలికకు కాఫీలో మత్తుమందు కలిపిచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో సదరు బాలిక గర్భవతి అయింది. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో 2015లో నిందితుడిపై ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అప్పటి సిఐ టి.రవీందర్ నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం బదిలీపై వచ్చిన సిఐ బి.ప్రకాశ్ ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సురేశ్‌నిందితుడికి పొక్సో చట్టం కింద శిక్షవిధిస్తూ తీర్పు ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News