Thursday, April 25, 2024

దివ్య హంతకుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

 Murdered

 

వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన కోల వెంకటేష్
వారం రోజులుగా హత్యకు కుట్ర, మృతురాలి కుటుంబాన్ని
ఆదుకుంటాం, నిందితుడికి శిక్ష పడేలా సత్వర చర్యలు తీసుకుంటాం
– మంత్రి కెటిఆర్ హామీతో ఆందోళన విరమించిన కుటుంబసభ్యులు

మన తెలంగాణ/గజ్వేల్(వేములవాడ) : గజ్వేల పట్టణంలో బ్యాంకు ఉద్యోగిని దివ్య (23) హత్య కేసులో నిందితుడు వెంకటేశ్ బుధవారం వేములవాడ సిఐ శ్రీధర్ ఎదుట లొంగిపోవడంతో కేసు విచారణ నిమిత్తం సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. కాగా, వారం రోజుల్లో పెళ్లి పీట లెక్కాల్సిన దివ్య మంగళవారం రాత్రి దారుణ హ త్యకు గురైన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆమె గజ్వేల్‌లోని ఎపి గ్రామీణ వికాస్ బ్యాం కులో అసిస్టెంట్‌మేనేజర్‌గా పనిచేస్తూ బ్యాం కు స మీపంలోనే ఓఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటోంది. ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌అనేయువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సిన నేపథ్యంలో ఇరు కుటుంబాల వారు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా..ఈ దారుణ ఘటన చోటుచేసుంది.

బ్యాంకులో పనులు ముగించుకుని ఇంటికి చేరిన దివ్య కాబోయే భర్త సందీప్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రేమోన్మాది వెంకటేశ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె గొంతు, మెడ భాగం కోసి పరారయ్యాడు. ఆ సమయంలో దివ్య తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడం..దివ్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సందీప్‌బ్యాంకు సిబ్బందికిసమాచారం ఇచ్చాడు.దీంతో చుట్టుపక్కల వారు, తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసేసరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. ప్రేమోన్మాదమే తమ కుమార్తె హత్యకు కారణమని దివ్యతల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

సంతోషంగా శుభలేఖలు
బ్యాంక్ ఉద్యోగి దివ్యకు వరంగల్‌కు చెందిన యువకునితో ఈనెల 26న వివాహం నిశ్చయ కావడంతో శుభలేఖలను సంతోషంగా బ్యాంకు సహచర ఉద్యోగులకు, ఇతర స్నేహితులకు మంగళవారం సాయంత్ర వరకు పంచిపెట్టింది. అలాగే ఆమె తల్లి తండ్రులు పెళ్లికి సంబంధించిన వస్తుసామాగ్రిని కొనుగోలు చేసేందుకు సిద్దిపేటకు వెళ్లారు. గజ్వేల్ పట్టణంలోని మురళీ కృష్ణాలయం వీధిలో పై అంతస్తులో అద్దె ఇంట్లో ఉంటున్న దివ్య మంగళవారం రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో కాబోయే జీవిత భాగస్వామి సందీప్‌తో పెళ్లి పనుల గురించి ఫోన్‌లో సంభాషిస్తున్న క్రమంలో వెంకటేశ్ దారుణంగా కత్తితో మెడ, గొంతు భాగాలపై దాడీ చేసి హత్యగావించాడు.

వారం నుంచి హత్యకు కుట్ర
తనను కాదన్న దివ్యను అంతమొందించాలని వెంకటేశ్ గత వారం రోజులుగా యత్నిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దివ్యను ఎలాగైనా చంపేయాలని పథకం రచించిన వెంకటేశ్ అవకాశం కోసం ఎదురు చూడటంతో పాటు కొంత కాలం నుంచి దివ్య కదలికలను గమనిస్తూ వచ్చాడు. మంగళవారం రాత్రి ఇంట్లో దివ్య ఒంటరిగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు ఆ ఇంట్లోకి వెళ్లి దివ్యపై దాడికి దిగాడు . దీంతో ఆమె పెద్దగా అరుస్తూ కేకలు వేసింది. ఆలస్యం చేయకుండా ఆమె మెడపై గొంతుపై కత్తితో కోసి ప్రాణాలు తీశాడు. ఆ మరుక్షణమే అక్కడినుంచి నిందితుడు పారిపోయాడు. ఆ సమయంలో ఫోన్ లైన్‌లో ఉన్న ఆమె కాబోయే భర్త సందీప్‌కు దివ్యనుంచి ఫోన్‌లో సమాధానం రాకపోవటంతో వెంటనే ఆమె సహచర ఉద్యోగులకు ఫోన్‌చేసి విషయం తెలియజేశాడు. దివ్య కేకలు విన్న ఇంటి యజమానులు సంఘటనా స్థలానికి వచ్చేసరికే దివ్య రక్తపు మడుగులో మృతి చెందింది. ఇంటి యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రేమోన్మాదమే కారణం
చిన్నప్పటి నుంచే దివ్యను ప్రేమపేరుతో నిందితుడు వెంకటేశ్ వేధించాడని మృతురాలి తల్లి మణెమ్మ తెలిపారు. కొద్దిరోజులు నిందితుని వేధింపులు భరింప లేక పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. దాంతో కొంత కాలం పాటు వేధింపులు తగ్గాయన్నారు. కానీ తన కూతురు పిజి చదువుకోసం ఒయులో చేరిన తర్వాత నిందితుడు వెంకటేశ్ నుంచి వేధింపులు మళ్లీ మొదలయ్యాయన్నారు. రెండు నెలల నుంచి ప్రేమ పేరుతో వేధింపులు తీవ్రం కావటంతో వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది. దీంతో నిందితుని తల్లితండ్రులు పోలీసుల ఎదుట ఇక ముందు దివ్య జోలికి రాడని తమతో చెప్పి పోలీసుల ముందు లిఖిత పూర్వక హామీని ఇచ్చారన్నారు.

ఈ పరిణామంతో ఊపిరి పీల్చుకున్న దివ్య తలితండ్రులు ఆమెకు మరో వివాహం నిశ్చయం చేశారు. కానీ ప్రేమోన్మాది అయిన నిందితుడు వెంకటేశ్ మాత్రం తనకు దక్కాల్సిన దివ్య మరొకరికి దక్కుతుండటంతో కసి పెంచుకున్నాడు. దివ్యను పథకం ప్రకారం హత్యచేయాలని నిర్ణయించుకున్న నిందితుడు వెంకటేశ్ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను దారుణంగా హతమార్చాడని మృతురాలి తల్లి రోధిస్తూ వివరించింది.

వేములవాడలో లొంగుబాటు
గజ్వేల్‌లో బ్యాంక్ ఉద్యోగిని దివ్యను హత్య చేసిన హంతకుడు బుధవారం వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కోల వెంకటేష్, న్యాలకంటి దివ్య గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ప్రేమించుకుంటున్నారని, మూడు సంవత్సరాల క్రితం దివ్య పై చదువులతో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఉద్యోగం రావడంతో వారి కుటుంబం గజ్వేల్‌కు మకాం మార్చారు. గత కొంత కాలంగా ఇద్దరం కలిసిఉందామని దివ్యను వెంకటేష్ అడిగినట్లు కుటుంబికులు తెలిపారు. ఇదిలా ఉండగా దివ్యకు ఈ నెల 26న వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన విషయం తెలుసుకున్న వెంకటేవ్ గజ్వేల్‌లో దివ్య ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా హత్య గావించాడు. ఈక్రమంలో గజ్వేల్ సిఐ మధుకర్ రెడ్డి పోలీసు బృందంతో బుధవారం వెంకటేష్ ఇంటికి చేరుకున్నారు. విషయంపై ఆరా తీస్తుండగా నిందితుడు వెంకటేష్ సాయంత్రానికి పట్టణ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

దివ్య మృతదేహంతో ఆందోళన : మంత్రి కెటిఆర్ హామీతో విరమణ
దివ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహాన్ని తరలించే ప్రస్తకే లేదని మృతురాలి కుటుంబసభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్‌చేశారు. ఈక్రమంలో ఆసుపత్రి ఆవరణంలో గంటపాటు ఆందోలన చేపట్టారు. కాగా విషయం తెలుసుకున్న మంత్రి కెటిఆర్ మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, నిందితుని శిక్ష పడేలా సత్వరమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తమకు కెటిఆర్‌పై పూర్తి నమ్మకం ఉందని, నిందితుడు వెంకటేశ్‌కు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మృతురాలి కుటింబీకులు మీడియాకు తెలిపారు.

నిందితుని తల్లిదండ్రులను ప్రశ్నించిన పోలీసులు
దివ్య హత్యకేసు విచారణలో భాగంగా నిందితుడిగా అనుమానిస్తున్న వెంకటేష్ తల్లిదండ్రులు పరుశరాం గౌడ్, లతను పోలీసులు వేములవాడలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వెంకటేష్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసుల విచారణలో ‘చిన్నప్పుడు 5,6 తరగతుల్లోనే వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారని, జ్యోతిష్మతి కాలేజీలో ఇద్దరు ఇంజనీరింగ్‌పూర్తి చేశారని నిందితుని తల్లిదండ్రులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌లో కోచింగ్‌కు వెళ్లిన వాళ్లు అక్కడే పెళ్లి చేసుకున్నామని మాతో చెప్పారని, అప్పట్లో అమ్మాయి మిస్సింగ్‌అంటూ దివ్య తల్లిదండ్రులు సనత్‌నగర్‌పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వివరించారు.

దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో పోలీసులను కలిశారన్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె తల్లిదండ్రులు తమ కుమారుడు వెంకటేష్ వేధిస్తున్నాడని 2018 అక్టోబర్‌లో ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు ఇద్దర్నీ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మరోసారి దివ్య జోలికి వెళ్లవద్దని పోలీసులు చెప్పడంతో రాత పూర్వకంగా హామీ ఇచ్చామని విచారణలో తెలిపారు. అయితే మా కొడుకు హత్య చేశాడని అనుకోవడం లేదని, చనిపోయిన వారిని చూస్తేనే భయపడే వాడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నామని వివరించారు.

Accused who Murdered Divya Surrendered to police
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News