Thursday, April 25, 2024

ఆడోళ్ల వెంటపడ్డా వేధించని కొవిడ్

- Advertisement -
- Advertisement -

ACE2 protein protects against severe COVID-19 in women

 

వారి క్రోమోజోమ్‌లే వారికి రక్ష

టొరంటో : కొవిడ్ 19 ఎక్కువగా ఆడవారి వెంటపడ్డా ఎక్కువగా వేధించడం లేదు. స్త్రీలలో వారి శారీరక ధర్మం మేరకు ఎక్కువగా హార్మోన్లు, క్రోమోసోమ్‌లు ఉంటాయి. దీనితో వారిలో మగవారితో పోలిస్తే అత్యధిక స్థాయిలో రోగనిరోధక శక్తి ఉంటుంది. దీనితో కొవిడ్ కాటుకు గురయినప్పటికీ మహిళలు తొందర్లోనే ఈ వైరస్ నుంచి కోలుకుంటున్నారు. ఈ విధంగా కొవిడ్ మరణాలలో ఆడవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. కెనడాకు చెందిన అల్‌బెర్టా యూనివర్శిటీ పరిశోధకుల సారధ్యంలో ఈ కీలక విషయంపై అధ్యయనం జరిగింది. వీటి వివరాలను అమెరికా జర్నల్ ఫిజియాలజీ హార్ట్ అండ్ సర్కులేటరి ఫిజియాలజీలో ప్రచురించారు. కొవిడ్ తాకిడికి ఆడ మగ తేడాలున్నట్లు వీరు కనుగొన్నారు. ఎఎస్‌ఇ 2 అనే ఎంజైమ్ పనితీరు మనిషిలోకి కరోనా వైరస్ ప్రవేశానికి గ్రాహకంగా ఉంటుంది. ఈ ఎంజైమే మనిషిలో గుండెజబ్బులు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.

ఈ ఎంజైమ్స్ క్రోమోజోమ్‌లను బట్టి మహిళల్లో ఇవి రెండు నమూనాలుగా ఉంటాయి. మగవారిలో ఇవి ఒక్కటే ఉంటాయని ప్రొఫెసర్ గవిన్ ఔడిట్ విశ్లేషించారు. మహిళలోకి ఓ రకపు ఎంజైమ్ నమూనా కరోనా వైరస్ గ్రాహకం అయినప్పటికీ మరో రకపు ఎంజైమ్ ఈ వైరస్ తీవ్రత లేకుండా ఉంటుంది. ప్రాణాంతక పరిణామాలు తలెత్తకుండా చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఎఎస్‌ఇ 2 అనేది ఎక్స్ క్రోమోజోమ్ సంబంధిత జన్యువు. దీని వల్ల రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది. ఇది మహిళలలో ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓ వైపు కరోనా వైరస్ వారికి తేలిగ్గానే సోకినప్పటికీ అంతకు మించిన సమర్థతతో ఈ వైరస్ నియంత్రణ జరుగుతుందని తేల్చారు. చలి జ్వరం వంటివి కూడా తట్టుకుని ఉంటారు. కొవిడ్ కేసులు సమగ్రంగా పరిశీలిస్తే మగవారిలో ఇది వ్యాపిస్తే వెంటనే నియంత్రణలోకి రావడం లేదు. పైగా ఇతరత్రా అనుబంధ జటిలతలు ఏర్పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పరిణామం ఇదే విధంగా ఉంది.

కొన్ని సందర్భాలలో కొవిడ్ తీవ్రత మహిళలలో ఎక్కువగా ఉన్నప్పటికీ పురుషులతో పోలిస్తే ఇది వారిలో ప్రాణాంతకం కాబోదు. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారు ఎక్కువగా శారీరకంగా బలహీనులుగా ఉంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకితే వారే ఎక్కువగా దెబ్బతినాల్సి ఉంటుంది. అయితే కరోనా మరణాలు, తీవ్రత విషయానికి వస్తే ఆడవారికి ఈ బెడద తక్కువగానే ఉన్నట్లు నిర్థారణ అయింది. ఎఎస్‌ఇ 2 స్థాయిలను బట్టి కొవిడ్ రోగులు కోలుకునేది, లేదా వైరస్ తీవ్రత పెరిగేది ఆధారపడి ఉంటుంది. ఇది ఏఏ స్థాయిల్లో ఏ విధంగా ఉంటుందనేది తాము పరిశీలిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. కొవిడ్‌ను శారీరక వ్యవస్థలోని అంతర్గత ఎంజైమ్‌ల క్రమంలోనే అరికట్టే విధానం ఉందని పరిశోధకులు గుర్తించారు. వ్యాక్సిన్ లేదా వైరస్ నివారక మార్గాలకు ఈ ఎంజైమ్‌లకు అనుసంధానం చేయడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? అనే విషయంపై కూడా దృష్టి సారించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News