Wednesday, April 24, 2024

‘హీరో’ నుంచి ‘అచ్చ తెలుగందమే’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు గల్లా అశోక్‌ కథానాయకుడిగా ‘హీరో’ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈమూవీలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. గల్లా పద్మావతి నిర్మిస్తున్న ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సినిమాలోని ‘అచ్చ తెలుగందమే..’ అనే తొలి పాటను విడుదల చేసింది. దగ్గుబాటి రానా సోషల్ మీడియాలో ఈ సాంగ్ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా.. జిబ్రాన్‌ సంగీత సారథ్యంలో ప్రముఖ సింగర్ సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

Acha Telugandhame Song Released from ‘Hero’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News