Home తాజా వార్తలు ట్యూషన్ల టీచర్‌పై యాసిడ్ దాడి

ట్యూషన్ల టీచర్‌పై యాసిడ్ దాడి

teacher

హైదరాబాద్ శివారు మల్లికార్జుననగర్‌లో దారుణం 

మన తెలంగాణ/షాపూర్‌నగర్: విద్యార్థులకు ట్యూషన్ చెప్తున్న ఓ టీచర్‌పై అగంతకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. జీడిమెట్ల పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం   మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పద్మానగర్‌కు చెందిన సూర్యకుమారి (45) భర్త,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త స్థానికంగా ఓ సీడు గోదాంలో పని చేస్తుంటాడు. సూర్యకుమారి గత 15 సంవత్సరాలుగా చింతల్‌లోని సిద్ధార్థ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు చదువు చెప్తూ, సాయంత్రం  సమయంలో  ట్యూషన్  చెపుతుంది. మల్లికార్జుననగర్‌లో ఓ షట్టర్‌ను అద్దెకు తీసుకోని ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్న  సూర్యకూమారి ఎప్పటిలాగే గురువారం సాయంత్రం ట్యూషన్ చెబు తుండగా గుర్తు తెలియని వ్యక్తి మొఖానికి కర్చీఫ్ కట్టుకోని వచ్చి టీచర్‌పై యాసిడ్ పోశాడు. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడకు వచ్చిన తోటి టీచర్లు ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.