Wednesday, April 24, 2024

కొత్త సంవత్సర వేడుకల్లో నిబంధనలు

- Advertisement -
- Advertisement -

మూడు కమిషనరేట్లలో ఆంక్షలు
ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్ మూసివేత
బేగంపేట ఫ్లైఓవర్‌కు మినహాయింపు
ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారికి మినహాయింపు
తెల్లవారు 5గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు
హెచ్చరించిన మూడు కమిషనరేట్ల సిపిలు

నూతన సంవత్సర వేడుకలకు నిబంధనలు పాటించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా ట్యాంక్‌బండ్‌పైకి అనుమతివ్వమని పేర్కొన్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌పైకి అనుమతించమని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.

ట్రాఫిక్ డైవర్ట్…

వివి స్టాట్యూ నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టిఆర్ మార్గ్ నుంచి వచ్చే వాహనాలను వివి స్టాట్యూ మీదుగా ఖైరతాబాద్, రాజ్‌భవన్ వైపు మళ్లించనున్నారు.
బిఆర్‌కేభవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ మీ దుగా ఇక్బాల్ మినార్, లకిడికాపూల్, ఆయోధ్య వైపు మళ్లించనున్నారు.
లిబర్టీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ అనుమతించరు, వారు ఎడమ చేతివైపు నుంచి అంబేద్కర్ స్టాట్యూ, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి మీదుగా వెళ్లాలి.
ఖైరతాబాద్ మార్కెట్ వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను ఖైరతాబాద్(బడా గణేష్) మీదుగా సెన్‌సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లకిడికాపూల్ వైపు మళ్లించారు.
మింట్ కంపౌండ్ లేన్ అడ్జసెంట్ నుంచి సెక్రటేరియట్ రోడ్డును మూసి వేయనున్నారు.
నల్లగుట్ట రైల్వే స్టేషన్ బ్రిడ్జి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు మీద నుంచి కర్బాలా మైదాన్ లేదా మినిస్టర్ రోడ్డు వైపు మళ్లించనున్నారు.
సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సేయిలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ ఎక్స్ రోడ్డు, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, లెఫ్ట్ తీసుకుని అశోక్ నగర్, ఆర్టిసి క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాలి.
బేగంపేట ఫ్లై ఓవర్ తప్పించి మిగతా ఫ్లైఓవర్లను 31వ తేదీ రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు మూసి వేయనున్నారు.
నగరంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు.
డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.

రాచకొండలో ….

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవ ర్లు, ఓఆర్‌ఆర్‌ను 31వ తేదీ రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 1గంట వరకు మూసివేయనున్నారు.
ఓఆర్‌ఆర్‌పైకి లైట్ వెహికిల్స్, ప్యాసింజర్ వాహనా లు అనుమతించరు. మీడియం, హెవీ వాహనాలను అనుమతిస్తారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారిని అనుమతిస్తారు. వారు ఫ్లైట్ టికెట్లను చూపించాల్సి ఉంటుంది.
కామినేని ఫ్లైఓవర్, ఎల్‌బి నగర్ ఫ్లైఓవర్, చింతకుంట అండర్ పాస్ రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు మూసివేయనున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు.

సైబరాబాద్‌లో ….

2019 New Year Celebrations will start soon

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ను ఈ నెల 31వ తేదీ రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు మూసివేయనున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారికి మినహాయింపు కలదు.
పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను మూసి వేయనున్నారు. ఎర్‌పోర్టుకు వెళ్లే వారికి మినహాయింపు కలదు.
సైబర్ టవర్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు.
ప్రజలు వాహనాలకు డ్రైవర్లను నియమించుకోవాలి.
ఫుట్‌పాత్‌లు, పబ్లిక్ రోడ్లపై ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దు.
డ్రైవర్లు, క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు యూనిఫాం ధరించాలి.
వాహనాల్లో ప్రజలను తీసుకెళ్లేందుకు నిరాకరించిన వారిపై రూ.500 జరిమానా, విధించబడును.
అధికంగా డబ్బులు డిమాండ్ చేసిన ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడును.
వాహనాల డాక్యుమెంట్లు సరిగా లేని వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు.
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపినప్పుడు ఆపి, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాలి.
మైనర్లు వాహనం నడిపితే కేసు నమోదు చేస్తారు, వాహన యజమాని, మైనర్‌పై కూడా కేసు నమోదు చేస్తారు.
వాహనాన్ని పోలీసులు సీజ్ చేసిన తర్వాత వేరే వాహనాన్ని సమకూర్చుకోవాలి.
నిబంధనలకు విరుద్ధంగా వాహనం సౌండ్ వచ్చే వాహనాలను సీజ్ చేస్తారు.
వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండా నడిపితే వాటిని ఆర్టిఓ అధికారులకు అప్పగిస్తారు.
సామర్థ్యానికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకున్న వారిపై చర్యలు తీసుకుంటారు.
ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, డెంజర్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News