Home తాజా వార్తలు నేను అబ్బాయిలకు కూడా కావాలట…

నేను అబ్బాయిలకు కూడా కావాలట…

Actor Arjun Mathurముంబయి : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజకీయ జీవిత నేపథ్యంలో వచ్చిన సినిమా “ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌”. ఈ సినిమాలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ మాథుర్ నటించారు. దీంతో అర్జున్ మాథురకు మంచి పేరు వచ్చింది. అయితే చాలా అందంగా ఉండే అర్జున్ “మేడ్‌ ఇన్‌ హెవెన్‌” అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ లో ఓ స్వలింగ సంపర్కుడి పాత్రలో ఆయన నటించారు. దీంతో అర్జున్ మాథుర్ గే అనుకొని చాలా మంది అబ్బాయిలు ఆయనకు అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారట. చాలా మంది అబ్బాయిలు తమను పెళ్లి చేసుకోవాలని అర్జున్ మాథుర్ ను అడుగుతున్నారట. తాను గేను కాదని చెప్పినా వారు వినడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ విడుదలైన తరువాత తమలో ఆత్మస్థైర్యం పెరిగిందని కొందరు స్వలింగ సంపర్కులు తనకు చెప్పారని ఆయన తెలిపారు. తాను నటించే పాత్రలతో, తన నిజ జీవితాన్ని కలిపి చూడొద్దని ఆయన నెట్ జన్లను కోరుతున్నారు.

Actor Arjun Mathur Comments on Gay