Wednesday, December 6, 2023

60వ వసంతంలోకి బాలయ్య

- Advertisement -
- Advertisement -

Actor Balakrishna birthday celebrations

 

బుధవారం సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ స్టార్ హీరో 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు బాలకృష్ణ చేత కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రహ్మణి, భరత్, తేజస్విని, మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు. ఇక గత వారం రోజుల నుండి బాలయ్య బర్త్ డేని పురస్కరించుకుని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ ప్రారంభించారు. బాలయ్య కామన్ డీపీని ట్రెండ్ చేసేశారు. బుధవారం సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. బాలకృష్ణ షష్టి పూర్తి సందర్భంగా ఆయన ఫోటోలతో సోషల్ మీడియా మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బాలకృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తును శుభాకాంక్షలు చెప్పారు.

మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు…

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. “60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో& ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని.. అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే” అంటూ చిరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ‘మా బాలకృష్ణ’ అంటూ చిరు ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. కాగా గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ, నందమూరి బాలయ్యల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి… బాలయ్యకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పి వివాదం పెద్దది కాకుండా పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. “నా సోదరుని కుమారుడు నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్లు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను”అని ఎం.మోహన్‌బాబు పేర్కొన్నారు.

ఎనర్జీకి పవర్‌హౌస్‌లాంటి వారు…

సూపర్ స్టార్ మహేష్‌బాబు సైతం బాలకృష్ణకు బర్త్ డే విషెష్ చెప్పి ఆయనపై తనకు గల అభిమానాన్ని చాటుకున్నారు. మహేష్ ట్విట్టర్‌లో… “ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు, నేను ఎప్పుడూ అభిమానించే హీరో బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి”అని చెప్పారు. మహేష్ తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు చెప్పడం బాలయ్య అభిమానులకు ఆనందం కలిగించింది. ఇక మహేష్ తండ్రి అయిన కృష్ణ… బాలకృష్ణతో కలిసి ‘సుల్తాన్’ అనే మల్టీ స్టారర్ చేయడం జరిగింది.

నా మొట్టమొదటి హీరో మీరే…

బాబాయ్ బాలయ్య విశిష్టమైన పుట్టినరోజు సందర్భంగా అబ్బాయ్ ఎన్టీఆర్ అరుదైన సందేశంతో విషెష్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా బాలయ్యపై తనకున్న అభిమానాన్ని, ప్రేమను తెలియజేశారు. “నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే బాబాయ్. జై బాలయ్య”అని ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక “ప్రియమైన బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీ వ్యక్తిగత, వృత్తిగత జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ‘బిబి3’లో మీరు అద్భుతంగా ఉన్నారు”అని సీనియర్ వెంకటేష్ ట్వీట్ చేశారు. మంచు లక్ష్మి కూడా బాలయ్యకు విషెస్ తెలిపారు. “నేను అన్నయ్య పిలిచే వారిలో బాలయ్య ఒకరు. 16 ఏళ్ల వయసు వారు మాత్రమే మీ ఎనర్జీని మ్యాచ్ చేయగలరు. 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు” అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News