Friday, April 19, 2024

చలపతిరావుకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుంటుంబసభ్యులతో పాటు ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, దమోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీనివాస్, యువ కథానాయకుడు మంచు మనోజ్, నటుడు గౌతమ్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా డిసెంబర్ 24 తేదీన చలపతిరావు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 1944లో కృష్ణ జిల్లాలో చలపతిరావు జన్మించారు. ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో ఆయన సినిమాల్లోకి వచ్చారు. చలపతిరావు వందల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News