Thursday, April 25, 2024

ఇర్ఫాన్‌ఖాన్ (53) కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 Irfan khan

 

ముంబయి: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ (53) కన్నుమూశారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఇర్ఫాన్‌ఖాన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2018 మార్చిలో తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని ఇర్ఫాన్ ప్రకటన చేశాడు. గత శనివారం రాజస్థాన్‌లో ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం(95) మృతి చెందింది. లాక్‌డౌన్ నేపథ్యంలో తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోయాడు. 2011లో పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. సలాంబాంబే చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. పలు ప్రాంతీయ భాషా చిత్రాలతో పాటు తెలుగులో సైనికుడు చిత్రంలో నటించాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మఖ్బూల్, లంచ్‌బాకస్ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

 

Actor Irfan khan passesaway with cancer in Mumbai
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News