Home తాజా వార్తలు ’సర్కారు వారి పాట‘ ప్రారంభం

’సర్కారు వారి పాట‘ ప్రారంభం

Actor Mahesh Babu Sarkaru Vaari Paata Beginsహైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ’సర్కారువారి పాట‘. ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం జరిగింది. ఇప్పటికే  ఈ సినిమా ఫ్రీలుక్ విడుదల కావడం, దీనికి మంచి స్పందన రావడం తెలిసిందే.  మ‌హేశ్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ కెమెరా స్విఛాన్ చేయ‌గా, కూతురు సితార ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టింది. కీర్తిసురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ 2021 జ‌న‌వ‌రి మొద‌టివారంలో ప్రారంభం కానుంది. థమన్ సంగీతం అందిస్తుండగా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నారు. మైత్రీమూవీ మేక‌ర్స్‌-జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌-14 రీల్స్ ప్ల‌స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేశ్ బాబు ’సర్కారువారి పాట‘ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.