Home తాజా వార్తలు పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న మోహన్ లాల్

పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న మోహన్ లాల్

Mohan-Lal

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డలను ప్రదానం చేశారు.  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కోవింద్‌ చేతుల మీదుగా ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ పద్మ భూషణ్‌ అవార్డును అందుకున్నారు. 2001లో మోహన్‌లాల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. చిత్రపరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ తాజాగా పద్మభూషణ్‌ అవార్డు వరించింది.  అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవా పద్మశ్రీ  వరించింది. నాట్య రంగంలో తన అమోఘమైన ప్రతిభను కనబరిచినందుకుగానూ ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది.

Actor Mohanlal on receiving Padma Bhushan