Monday, June 23, 2025

ముకుల్ దేవ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయ్‌లోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. రవితేజ, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన కృష్ణ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ముకుల్ దేవ్ ఆ తర్వాత ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్ వంటి సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. సిద్ధం, మనీ మనో మోర్ మనీ, నిప్పు చిత్రాల్లో నటించిన ఆయన తెలుగులో నటించిన చివరి చిత్రం 2013లో నాగార్జున హీరోగా నటించిన భాయ్. దస్తక్ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముకుల్ దేవ్ హిందీ,తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లో నటించారు. ముకుల్ దేవ్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News