Home తాజా వార్తలు నటుడు రాజ్‌తరుణ్‌కు తప్పిన ప్రమాదం

నటుడు రాజ్‌తరుణ్‌కు తప్పిన ప్రమాదం


హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డులోని నార్సింగ్ ప్రాంతం అల్కాపూర్ వద్ద మంగళవారం ఉదయం నటుడు రాజ్  తరుణ్‌కు రోడ్డు ప్రమాదం తప్పింది.  తరుణ్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తరువాత  రాజ్  తరుణ్‌ వేరే కారులో వెళ్లిపోయారు. ఈ ప్రమాదం నుంచి అతడు చిన్నపాటి గాయాలతో బయటపడినట్టు సమాచారం. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Actor Raj Tarun Escaped from Road Accident In ORR