Home జాతీయ వార్తలు ఎపి రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యాతగా సాయికుమార్

ఎపి రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యాతగా సాయికుమార్

SAIKUMARగుంటూరు : ఎపి నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను ఎపి సిఎం చంద్రబాబు, పలువురు మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రాల పంపిణీజరుగుతోంది. శంకుస్థాపన సందర్భంగా జరిగే సభలో వ్యాఖ్యాతగా నటుడు సాయికుమార్ వ్యవహరించనున్నారు. ప్రధాని మోడీ సహా వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.