Home Default బాలీవుడ్ నటుడు శివకుమార్ వర్మ పరిస్థితి విషమం

బాలీవుడ్ నటుడు శివకుమార్ వర్మ పరిస్థితి విషమం

Actor Sivakumar Varma Health Condition Criticalముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటుడు శివకుమార్ వర్మ ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా కూడా సోకిందని వైద్యులు తెలిపారు. అయితే చికిత్స చేసేందుకు సరిపడ డబ్బులు లేదు. దీంతో ఆయన దాతల సహాయం అర్థిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వైద్యానికి అవసరమైన డబ్బు సాయం చేయాలని  సినీ, టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అఫీషియల్‌ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. శివకుమార్ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారని, దాతలు ముందుకొచ్చి ఆయనకు సాయం చేయాలని  సినీ, టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ దాతలను కోరారు  నటులు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్‌, విద్యాబాలన్‌ సహా పలువురు ప్రముఖులను అసోసియేషన్ ట్యాగ్‌ చేసింది. బాజీ జిందగీ కి, హల్లా బోల్  తదితర సినిమాల్లో నటించి  శివ్‌కుమార్ వర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.