Home జాతీయ వార్తలు మూడు లక్షల మందికి ఉద్యోగాలు : సోనూసూద్

మూడు లక్షల మందికి ఉద్యోగాలు : సోనూసూద్

Actor Sonu Sood Announces 3Lakh Jobs ఢిల్లీ: కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ నటుడు సోనూసూద్ రియల్ హీరోగా మారాడు. తన సొంత నిధులతో ఎంతో మంది వలస కార్మికులను ఆయన ఆదుకున్నారు. సాయం కావాలని కోరిన ప్రతిఒక్కరిని తనకు తోచిన రీతిలో ఆదుకుంటున్నాడు. గురువారం సోనూసూద్ 47వ పుట్టిన రోజును జరుపుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు సోనూసూద్ వెల్లడించారు. ఇటీవల ఆయన ప్రారంభించిన  ‘ప్రవాసీ రోజ్‌గార్‌’ పోర్టల్‌ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి పిఎఫ్, ఇఎస్ఐ తదితర సౌకర్యాలను కలిపిస్తామని ఆయన తెలిపారు. ఇది తన తరపున చిన్న కానుక అని ఆయన తన ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో పోస్టు చేశారు. ఈ ఉద్యోగాలు కల్పించడంలో తనతో భాగస్వాములైన ఆయా సంస్థలకు సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు.