Home తాజా వార్తలు ఈ నటి ఎవరో చెప్పండి…!

ఈ నటి ఎవరో చెప్పండి…!

Actress Adah Sharmaహైదరాబాద్‌ : ఫై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో చెప్పగలరా…? ఎత్తుపళ్లతో చేతిలో పిజ్జాపట్టుకుని కనిపిస్తున్న తనను గుర్తించాలని ఆ నటి అభిమానులకు సూచించింది. ఈమె ఎవరో కాదు… తెలుగులో వచ్చిన ’హార్ట్ ఎటాక్ ‘ సినిమా హీరోయిన్ ఆదా శర్మ. ఈ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసుంది. అయితే ఆమె అభిమానులు ఆమెను గుర్తించారు. ఎంత మేకప్ చేసుకున్నా…. మిమ్ములను గుర్తు పట్టామంటూ వారు రిప్లై ఇచ్చారు. అయితే ఆదా శర్మ ఈ లుక్ లో ఎందుకు తయారైందో తెలియజేయలేదు. ’క్షణం‘ తరువాత ఆదాశర్మ ఇటీవల విడుదలైన కల్కిలో హీరో రాజశేఖర్ తో జతకట్టింది. అదేవిధంగా ఆమె ’కమాండో3‘, ’బైపాస్ రోడ్‘ అనే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాదు వెబ్ సిరీస్ తో కూడా సందడి చేస్తున్నారు. మొదటి సారి ’ ది హాలీడే ‘ అనే సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ఇటీవల విడుదలై విజయవంతమైన విషయం తెలిసిందే.

Actress Adah Sharma New Look