Home తాజా వార్తలు సినిమాలకు గుడ్ బై చెప్పనున్న అనుష్క

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న అనుష్క

Actress Anushka Retire From Actingహైదరాబాద్ : సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రముఖ నటి అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. గ్లామర్ పాత్రలతో పాటు మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అనుష్క నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటించిన అరుంధతి, భాగమతి, రుద్రమదేవి వంటి మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిశాయి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో కూడా దేవసేన వంటి కీలక పాత్రలో అనుష్క నటించారు. అనుష్క నటించిన నిశబ్ధం సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవలి కాలంలో  సినిమాలను తగ్గించడంతో అనుష్క పెళ్లి చేసుకోనుందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై అనుష్క ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు.