Home తాజా వార్తలు డేటింగ్ యాప్‌లో సినీనటి ఫొటోలు

డేటింగ్ యాప్‌లో సినీనటి ఫొటోలు

Actress Geethanjali Photos in Dating Apps

 

సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి

హైదరాబాద్ : డేటింగ్ యాప్‌లో తన ఫొటో పెట్టి వేధిస్తున్నారని సినీనటి నగర సైబర్ క్రైం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం… సినీ నటి గీతాంజలి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా నటించింది. హాట్‌లైవ్ డేటింగ్ యాప్‌లో గీతాంజలి ఫొటో, మొబైల్ నంబర్‌ను అప్‌లోడ్ చేశారు. కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి పెట్టారు. దీంతో గీతాంజలికి ఫోన్లు రావడం ప్రారంభమైంది. దీంతో వాటి గురించి వివరాలు తెలుసుకున్న గీతాంజలి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సెలబ్రిటీల ఫొటోలు పెట్టి డబ్బులు సంపాధించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన లాంటి పరిస్థితి ఎవరికి రావద్దని, తాను నటిగా ఎదుగుతుంటే ఓర్వలేని వారు తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై వ్యక్తిగతంగా అసూయపెట్టుకుని ఇలా చేశారని తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేశానని తెలిపారు. సైబర్ క్రైం పోలీసులపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

Actress Geethanjali Photos in Dating Apps