Home తాజా వార్తలు నాగ్‌తో జత కట్టనున్న ఇలియానా

నాగ్‌తో జత కట్టనున్న ఇలియానా

Actress Ileana Act With Nagarjuana In New Movieహైదరాబాద్ : తెలుగు తెర మన్మథుడు అక్కినేని నాగార్జునకు జోడీగా ప్రముఖ హీరోయిన్ ఇలియానా నటించనుందని టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. నాగార్జున – ప్రవీన్ సత్తార్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర మగరాయుడిలాగా ఉంటుందట. ఈ క్రమంలో ఈ పాత్రకు ఇలియానా పేరును పరిశీలించారని, ఆమెనే ఈ పాత్రకు ఎంపిక చేయాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి నాగార్జున – ఇలియానా ఎప్పుడో జంటగా నటించాల్సి ఉంది. అయితే ఇంతకాలానికి వీరు జోడీ కడుతున్నారన్న వార్తలు వస్తుండడంతో వారి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం నాగార్జున యాక్షన్ జోనర్‌లో సాగే వైల్డ్‌డాగ్ అనే సినిమాలో నటిస్తున్నారు. అహిసోర్ సాల్మన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున తాను హోస్ట్ గా చేసే బిగ్‌బాస్-4 పనుల్లో బిజీగా ఉన్నారు.