Home తాజా వార్తలు రజనీకాంత్ కింగ్ మేకర్ కారాదు : ఖుష్బూ

రజనీకాంత్ కింగ్ మేకర్ కారాదు : ఖుష్బూ

Actress Khushbu Comments on Rajinikanthచెన్నయ్ : సూపర్‌స్టార్ రజనీకాంత్ కింగ్ మేకర్ కాకూడదని, కింగ్‌లా ఉండాలని ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ పేర్కొన్నారు. కరుణానిధి, జయలలిత చనిపోయిన తరువాత తమిళ రాజకీయాల్లో తీవ్ర లోటు ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు. రజనీ రాష్ట్రాభివృద్ధి కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో తనకు తెలియదని, వీలైనంత త్వరలో ఆయన పార్టీని ప్రారంభిస్తారన్న ఆశాభావాన్ని ఖుష్బూ వ్యక్తం చేశారు. కమల్‌హాసన్ గత లోక్‌సభ ఎన్నికల్లో మంచిగా రాణించారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలనేవి ఎప్పుడూ భిన్నంగా ఉంటాయని ఆమె తెలిపారు. రాజకీయాల్లోకి యువ నటులు రావాల్సిన అవసరం ఉందని, వారిని రాజకీయాల్లోకి వచ్చేవిధంగా ప్రోత్సహించాలని ఆమె సూచించారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడిందని ఆమె వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భిన్న వాతావరణం ఉండే అవకాశం ఉందని ఆమె చెప్పారు.