Thursday, March 28, 2024

దయచేసి ఇండియాను మరో ఇటలీ చేయొద్దు: మీనా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నకరోనా వైరస్ మహమ్మారిపై పలువురు సినీతారలు, క్రికెట‌ర్స్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కలిసి ఓ వీడియోని రూపొందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటలో రూపంలో చూపించిన చిరు, నాగ్ కు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. తాజాగా నటి మీనా కూడా కరోనా విషయంలో అవ‌గాహ‌న సందేశం ఇచ్చారు.

”కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించినప్ప‌టికీ కొంద‌రు సీరియ‌స్‌గా తీసుకోకుండా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ప్ర‌యాణాలు చేస్తున్నారు. వీరిని చూస్తుంటే బాధ‌గా ఉంది. ద‌య‌చేసి ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు న‌డుచుకోవాలి.  ప్ర‌భుత్వం చెప్పింది విన‌కపోవడం వల్లే ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో శవాలు  గుట్టలుగా పడి ఉన్నాయి. విదేశాల్లో చనిపోతే శవాలు ముట్టుకోడానికి కూడా ఎవరూ ముందుకు రాని ప‌రిస్థితి. దయచేసి ఇండియాను మ‌రో ఇట‌లీ చేయొద్దు. ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికే ప‌రిమిత‌మైతే క‌రోనాను త‌రిమేయ‌వ‌చ్చు. ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అద్భుతమైన అవకాశం అందరికీ దొరకదు. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది. దయచేసి అందరూ బాధ్యతగా వ్యవహరించండి. ఇంటిపట్టునే ఉండండి.. సురక్షితంగా ఉండండి..” అని మీనా వేడుకున్నారు.

Actress Meena Video Message on Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News