Home తాజా వార్తలు జైపూర్‌లో హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం.. (ఫోటోలు)

జైపూర్‌లో హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం.. (ఫోటోలు)

కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పలువురు సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుబెట్టారు. తాజాగా యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కూడా త్వరలో పెళ్లి పీఠలెక్కనుంది. హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భ‌జ‌న్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్‌ని పెళ్లిచేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం జైపూర్‌లో మెహ్రీన్, బిష్ణోయ్‌ల నిశ్చితార్థ ఘనంగా జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకలో కాబోయే కొత్త దంపతులు ఒకరికొకరు నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో అభిమానులతోపాటు నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, వీరి వివాహ తేదిని ఇంకా నిర్ణియించలేదని మెహ్రీన్ తల్లి పేర్కొంది. కాగా, ప్రస్తుతం మెహ్రీన్ తెలుగులో ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.

 

Actress Mehreen Engaged to Bhavya Bishnoi in Jaipur