Home తాజా వార్తలు ఆగిన నటి మెహరీన్ పెళ్లి

ఆగిన నటి మెహరీన్ పెళ్లి

Actress Mehreen Marriage Is Stoppedహైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ మెహరీన్ పెళ్లి ఆగిపోయింది. హరియాణా మాజీ సిఎం భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఇటీవల మెహరీన్‌ నిశ్చితార్థం జరిగింది. కరోనా నేపథ్యంలో వీరి  పెళ్లి వాయిదా పడింది. అయితే తమ పెళ్లి జరగడం లేదని, ఆగిపోయిందని మెహరీన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భవ్య బిష్ణోయ్‌తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నానని,  ఈ నిర్ణయం తామిద్దరం కలిసి తీసుకున్నామని,  తాము  పెళ్లి చేసుకోవడం లేదని మెహరీన్ తెలిపారు. ఇకపై తనకు భవ్యబిష్ణోయ్‌, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదని ఆమె స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని, తన వ్యక్తిగత గోప్యతను అభిమానులు గౌరవిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై పెట్టానని, అభిమానులను అలరించేలా సినిమాలు చేస్తానని తేల్చిచెప్పారు. ప్రస్తుతం మెహరీన్  ‘ఎఫ్‌ 3’ సినిమాలో నటిస్తున్నారు.