Home తాజా వార్తలు భారీగా పారితోషికం పెంచిన నయన్

భారీగా పారితోషికం పెంచిన నయన్

Actress Nayantharaచెన్నయ్ : వరుస విజయాలతో దూసుకెళుతూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయన తార తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ లలో నయన తారకు విపరీతమైన క్రేజీ ఉంది. సీనియర్ హీరోలతో పాటు స్టార్ డమ్ ఉన్న హీరోలు, వర్థమాన హీరోలతో ఒక పక్క నటిస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఆమె నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నయనతార సైరా సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. తమిళంలో రజనీ సరసన ‘దర్బార్’, విజయ్ సరసన ‘బిజిల్’ తదితర సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటి వరకు ఆమె ప్రతి సినిమాకు రూ.4 కోట్ల పారితోషికం తీసుకునేది. ఈ క్రమంలో తనకున్న క్రేజీ కారణంగా తన పారితోషికాన్ని రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లకు పెంచిందని, సైరా సినిమా కోసం రూ.6 కోట్ల పారితోషికం తీసుకుందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే నయనతార మాత్రం తన పారితోషికం పెంపుపై క్లారిటీ ఇవ్వలేదు.

Actress Nayanthara Increased Her Remuneration