Home తాజా వార్తలు ’గమనం‘ నుంచి నిత్యామీనన్ ఫస్ట్ లుక్ విడుదల

’గమనం‘ నుంచి నిత్యామీనన్ ఫస్ట్ లుక్ విడుదల

Actress Nithya Menen First Look From Gamanamహైదరాబాద్ : ప్రముఖ నటి శ్రియ ప్రాధాన పాత్రలో నటిస్తున్న సినిమా ’గమనం.‘ ఈ సినిమాలో మరో ప్రముఖ నటి నిత్యామీనన్ క్లాసికల్ సింగర్ శైలపుత్రీ దేవి పాత్రలో నటిస్తున్నారు. నిత్యా మీనన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను హీరో శర్వానంద్ విడుదల చేశారు. ఈ సినిమాకు సుజనారావు దర్శకత్వం వహిస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌ పని చేస్తూనే , ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా ’గమనం‘ రానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జరుపుకుంటోంది. శ్రియ, నిత్యా మీనన్ తో పాటు  ఇంకా ఈ సినిమాలో ప్రియాంకా జ‌వాల్క‌ర్, శివ కందుకూరి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.