Home తాజా వార్తలు ప్రేమలో పాయల్ రాజ్ పుత్

ప్రేమలో పాయల్ రాజ్ పుత్

Payal Rajputహైదరాబాద్ : ప్రముఖ నటి పాయల్ రాజ్ పుత్ ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ అందుకున్న పాయల్ ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ , హీరో నాగచైతన్య మామా అల్లుళ్లుగా వస్తున్న వెంకీ మామ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె వెంకటేశ్ కు జోడీగా నటిస్తోంది. అంతేకాదు రవితేజ డిస్కోరాజా సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ’RDX లవ్‘ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం బిజీగా ఉన్న పాయల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన ఫొటోలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తితో దిగిన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోకు మూడు లవ్ సింబల్స్ ను కూడా జత చేసింది. దీంతో పాయల్ ప్రేమలో పడ్డారని, అతడే పాయల్ ప్రియుడంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై పాయల్ రాజ్ పుత్ స్పష్టత ఇవ్వలేదు.

Actress Payal Rajput In Love