Home తాజా వార్తలు అఖిల్ సినిమాలో పూజా హెగ్డేకు భారీ పారితోషికం

అఖిల్ సినిమాలో పూజా హెగ్డేకు భారీ పారితోషికం

Actress Pooja Hegdeహైదరాబాద్ : బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కొంత వరకు చేశారు. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నటించే హీరోయిన్ పేరు ఖరారైందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్మిక మందన, కైరా అడ్వాణీ, నివేదిత పేతురాజ్ పేర్లు వినిపించాయి. అయితే అఖిల్ సరసన పూజా హెగ్డే నటించనుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అఖిల్ కు జోడీగా నటించేందుకు పూజా రూ.3.5 కోట్లను పారితోషికంగా డిమాండ్ చేసిందని, ఈ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ లో పూజా జాయిన్ కానుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్ ను కూడా ఖరారు చేశారని, ఫస్టు లుక్ తో టైటిల్ ను త్వరలోనే రివీల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Actress Pooja Hegde Act In Hero Akhil Movie