Home తాజా వార్తలు గ్రీన్‌ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నటి రష్మిక

గ్రీన్‌ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నటి రష్మిక

Actress Rashmika Planted Plants in Green Challengeహైదరాబాద్‌: టిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు అనూహ్య స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ కు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు స్పందిస్తూ మొక్కలు నాటుతున్నారు. ప్రముఖ నటి సమంత చేసిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను మరో నటి రష్మిక మందన స్వీకరించారు. ఈ క్రమంలో ఆమె గురువారం ఉదయం తన ఇంట్లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ప్రారంభించిన ఎంపి సంతోష్ కుమార్, తనకు గ్రీన్ చాలెంజ్ విసిరిన సమంతకు రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. నటీమణులు రాఖీఖన్నా, కల్యాణ్ ప్రియదర్శన్ కు రష్మిక గ్రీన్ చాలెంజ్ విసిరారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఆమె తన అభిమానులను కోరారు.