Home తాజా వార్తలు 2022లో తల్లినవుతా… సమంత

2022లో తల్లినవుతా… సమంత

Actress Samanthaహైదరాబాద్ : ప్రముఖ నటి సమంత హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని రెండేళ్లు పూర్తయ్యాయి. దీంతో సమంత త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సినిమా పరిశ్రమలో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో తాను తల్లి కాబోతున్నట్టు వినిపిస్తున్న గుసగుసలపై సమంత స్పందించారు. సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో మీరెప్పుడు తల్లి కాబోతున్నారంటూ సమంతకు ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సమంత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 2022 సంవత్సరంలో ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు ఓ బిడ్డకు జన్మనిస్తానని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత ఇచ్చిన సమాధానాలేమిటో ఈ వీడియోలో చూడొచ్చు.

Actress Samantha Answered To Netizens Questions