Home తాజా వార్తలు ‘ఓ మై గాడ్’ సీక్వెల్‌లో యామీ గౌతమ్

‘ఓ మై గాడ్’ సీక్వెల్‌లో యామీ గౌతమ్

Actress Yami Gautam Act In 'Oh My God' Sequelముంబయి :  2012 లో వచ్చిన  ‘ఓ మై గాడ్’ సినిమా నాడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాకు స్వీక్వెల్ ను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సీక్వెల్ లో నటి యామీ గౌతమ్ హీరోయిన్ గా నటించనున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, పరేశ్ రావల్ కీలక పాత్రల్లో ఉమేశ్ శుక్లా రూపొందించిన సినిమా  ‘ఓ మై గాడ్’. ఈ సినిమా విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ రూపొందిస్తారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే ఇన్నేళ్ల కాలం తర్వాత ‘ఓ మై గాడ్’ సినిమాకు  సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో ఈ సినిమా నిర్మాతలు ఉన్నట్టు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌లో అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా, పంకజ్ త్రిపాఠీ భక్తుడిగా కనిపిస్తానున్నారన్ని తెలిసింది. పంకజ్ త్రిపాఠీకి జంటగా  యమీ గౌతమ్ నటించబోతున్నాట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే  ఈ సీక్వెల్‌కి ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించడం లేదని,  దర్శకుడు, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.