Saturday, April 20, 2024

అదానీ గ్రూప్ @ 100 బిలియన్ డాలర్లు

- Advertisement -
- Advertisement -

Adani Group's market cap crosses $100 billion

 

ముంబై : అదానీ గ్రూప్ మార్కెట్ మూలధనం 100 బిలియన్ డాలర్ల (రూ.7.34 లక్షల కోట్లు) మార్క్‌ను దాటింది. ఈ కీలక మార్క్‌ను చేరిన మూడో భారతీయ కంపెనీ ఇదే. బిలియనీర్ గౌతమ్ అదానీ ఆధ్వర్యంలోని పోర్ట్‌ల నుంచి ఇంధన వరకు బహుళ వ్యాపారాలు కల్గిన ఈ సంస్థకు చెందిన షేర్లు మార్కెట్లో భారీ వృద్ధిని సాధించడంతో ఈ రికార్డు సృష్టించింది. మంగళవారం అదానీ కంపెనీ షేర్లు ఆల్‌టైమ్ హైకి చేరాయి. స్టాక్ ఎక్సేంజ్ గణాంకాల ప్రకారం, అదానీ గ్రూప్‌కు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ.84 లక్షల కోట్లు అంటే 106.8 బిలియన్ డాలర్లు ఉంది. గౌతమ్ అదానీ 1980లో కమోడిటీ ట్రేడర్‌గా వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆయన గనులు, పోర్టులు, పవర్ ప్లాంట్ల నుంచి ఎయిర్‌పోర్ట్‌లు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్, డిఫెన్స్ వరకు వివిధ రంగాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.

గత రెండేళ్లలోనే గ్రూప్ దాదాపు ఏడు ఎయిర్‌పోర్ట్‌లను సొంతం చేసుకుంది. అంటే దేశీయ విమాన ట్రాఫిక్‌లో నాలుగింట ఒక వంతు అన్నమాట. పునరుత్పాదక ఇంధన సామర్థంలో వేగంగా వృద్ధిని సాధించారు. శ్రీలంకలో పోర్ట్ టర్మినల్ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు. ఇటీవల గంగవరం పోర్టులో ప్రధాన వాటాను ఆయన చేజిక్కించుకున్నారు. అలాగే గుజరాత్‌లో పవర్ ప్లాంట్, ముంబై కోస్ట్‌లో సహజ వాయువు నిల్వల పరిశోధన, సోలార్ ప్రాజెక్టుల కొనుగోలు, ఎస్సెల్ సంస్థ నుంచి పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల కొనుగోలు వంటి ఎన్నో విస్తరణ పనులు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News